ఏం అబ్జెక్షన్ నీది? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే: విష్ణుకుమార్ రాజుపై భగ్గుమన్న చంద్రబాబు

  • చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్న విష్ణుకుమార్ రాజు
  • కట్టలు తెంచుకున్న చంద్రబాబు ఆగ్రహం
  • న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టబోనని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. చంద్రబాబు ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న వేళ, బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. "గుజరాత్ కు వెళ్లి చూడవయ్యా... కంపేర్ చెయ్యి... కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసిది పోయి, సిగ్గు వదిలిపెట్టి, మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలా? రోషం లేదా మాకు" అన్నారు.

ఈ సమయంలో 'అబ్జెక్షన్' అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా..? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు" అని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Assembly
Vishnukumar Raju

More Telugu News